28, ఆగస్టు 2015, శుక్రవారం

ఏం చేసానో అర్థం కాలేదు

ఎం చెద్దామనుకున్నవు.....

ఎం చెసావు....

ఇప్పుడు ఏం జరిగిన్ది...

ఇంక ఎం మిగిన్లిన్ది ....

అంతా శూన్యం ....


26, ఆగస్టు 2015, బుధవారం

అర్త్దరాత్రి.... కార్యలయంలొ ......

     అర్త్దరాత్రి.... కార్యలయంలొ ......

జీవులన్నీ సంధ్యా  సమయం కాగానె ఇంటి ముఖం పడతాయి. పిట్టలు,ఆవులు,గెదెలు,మెకలు,గొర్రెలు  ఒక్క మనిషి తప్ప. ఏప్పుడు పనె ఈ జీవితానికి. సాదారణంగా అందరు సాయంత్రానికి ఇంటికి వచ్హెస్తారు , పని కొంచెం ఆలస్యం   ఐతె రాత్రికి వస్తారు , ఈ సహాయక ఉద్యొగాలు (Support Projects) ఎమిటొ కాని రాత్రికి పని కొసం బయలుదెరటం.

అందరు చెంగు చెంగుమని ఇంటికి పోతా ఉంటె ఇప్పుడు పనికి పొయ్యేది ఏందీ అంట.... సన్నాసి... :P.

ప్రభుత్వ ఆసుపత్రి లో అనాధ శవం లాగ ..... ఒక మూలగ కూర్చొని పని చేస్కోవటం .... పని లేదంటే అక్కడే నిద్ర పోలేక ... అక్కడి నుండి బయటికి పొలెక... మాట్లాడానికి మనుషులు లెక.... వద్దురా బాబు .... ఏ బ్రాహ్మి కి కూడా ఈ కష్టాలు వద్దు.

వారపు రోజుల్లోనే ఇలా ఉంటె .. ఇంకా వారంతంలో వచ్చే వాళ్లకి పాదభివన్దనాలు.... _/\_

మాములుగా  ఊర్లో ఐతే .. ఈ రాత్రిళ్ళు నక్కల అరుపులు వినపడతాయి ..  ఇక్కడ కీ బోర్డు శబ్దాలే కాని  మనుషుల గుండె చప్పుడు కూడా వినపడదు.

ఐన తప్పదు  ఉద్గోగం పురుష లక్షణం (ఆడోల్లు చూస్తె తన్తరేమో  .. ఈ వివక్ష ఏంటి అని ).....  ఉద్గోగం మానవ లక్షణం ....  మానేసి జీవితం లో ఇంకా ముందుకు వెళ్లకపోవటం మనిషి బద్ధకం ....

గేటు దగ్గర కాపలా వాడికి  ... ఈ పెట్టె ముందు నాకు అట్టె తేడా ఏమి కనపడటం లెదు... హిహిహి





 


 
 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

నేను - నా దీపావళి

అందరికి దీపావళి శుభాకాంక్షలు.

ఈ రోజు దీపావళి (కొంప తీసి దీపావళి కథ మరియు పుట్టు పూర్వోత్తరాలు చెబుతావా ఏమిటి ?), నాకు సరిగా తెలిసి ఏడిస్తే కదా మీకు చెప్పటానికి.

అయితే బాంబుల(సీమ  నాటు బాంబులు కాదు - టపాసుల గురించి ) గురించా ?

నువ్వు చెప్పేదేమిటో మాకు తెలియదా ? ఎన్ని కాల్చలేదు  అంటారా ?

ఇదే వోటేర్లతో ( బ్లాగర్లతో ) వచ్చిన చిక్కు - మనకి తెలిసింది చెబ్తమంటే ,మాకు ముందే తెలుసుసంతారు , పోనీ మనకి తెలియనిది  చెబ్తమంటే : తెలియకుండా ఎలా చెప్పేది ??? :(

నా బ్లాగు , నా ఇష్టం . నేను చెప్పాలనుకున్నది చెప్తాను. వినేవాళ్ళు వినండి  (అదేనేహే చదివేవాళ్ళు చదవండి )..

చదివిన తర్వాత మీ కోపతాపాలకు నాది భాద్యత కాదు .

నా  చిన్నప్పుడు (అప్పటి నుంచి చెప్తావ ఎం ? - కాదు అప్పుడు జరిగిందే చెప్తాను ).
. .
.. ..




దినసరి సాంఘికం (డైలీ సీరియల్ ) లాఆఆఆఆఅగ సాగాతిస్తడే కాని విషయం చెప్పదేన్త్రా వీడు ?

అక్కడికే వస్తున్నా (ఎక్కడికి రాకు అక్కడే ఉండి చెప్పు).

సరే  అలాగే చేద్దాం .. దానిదేముంది !

నేను , నా అన్న , మాకు అక్క ... మేము పిల్లలం  ఇంట్లో .. ఇక దీపావళి సామాను తేవటానికి మా అక్కే వెళ్ళేది నాకు గుర్తు  ఉన్నప్పటి నించి. మరి మా అక్కతో పాటు రక్షణగా మగ మహారాజులం నేను వెల్లెవాదడిని. మనకేమో ఎప్పుడు ఆ పది పైసల బాంబుల సంచి (తెలుగీకరణ : పాకెట్టు ) కొని ఇస్తుందా , ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ఒక అగరుబత్తి వెలిగించి ఆయాసం వచ్చేవరకు వాటిని కలుద్దామా అని . కానీ మా అక్క మహా తెలివినది కదా ! ముందు ఆ దీపాలు , వత్తులు , నూనే , కిరణా సామాను ఇంకా ఎన్నెనో (అప్పటికి మనకు పేర్లు కూడా తెలియవు కదా )


టార్గెట్ : ఎర్ర బాంబు

అలా రకరకాల సామాన్ల కోసం తిప్పిన కొట్టు తిప్పకుండా తిప్పి అప్పుడు తీసుకుని వచ్చేది టపాకాయల దుకాణానికి. ఆ కొట్టు వాడితో మన టార్గెట్ గురించి తప్ప మిగతా వన్ని రేట్ అడిగేది (కొనేది కూడా లెండి ) . ఆ కొట్టు వాడేమో అన్ని అక్క అడిగినవే చెప్తున్నాడు , మనకేమో సమాదానం లేదు ( ఎలా  వస్తది : మనం వాడికి కనపడితే కదా : వాడి సామాన్లు పెట్టిన బల్ల మనకంటే పొడుగు ఉంది :().

అలా బాంబులు కాల్చే లోపే నీరసం వచీసేది .. అప్పుడు అప్పుడు  అక్క కొని ఇచ్చేది మన ఎర్ర బాంబుల ప్యాకెట్ ...
ఆంజనేయుడికి తన శక్తి వచ్చినట్టు ,  క్లైమాక్స్ లో హీరో కి  విలన్  ని  చితకబాదె ఎనర్జీ వచ్చేది ... ఇంక ఆ ప్యాకెట్ పట్టుకొని పరుగో పరుగు ఇంటికి .


ఎమైనా ఆ రోజులే వేరు ...














ఇవాళ పొద్దున్నే కార్యాలయమునకి బయలు దేరెందుకు సిద్దమవుతుండగా (అవును ఇవాళే : పండగ రోజే  ది 23-10-2014 శెలవు లేదు : శెలవు లేని పని వీడు ఏమి చేస్తున్నద అని మీరు బుర్రలు బద్దలుకొట్టు కోవద్దు : నేనో బ్రహ్మి సా. ఇ  ) మా అక్క కూతురు చిన్నారి ఫోన్ చేసింది.

చిన్న మామ ... చిన్న మామ .... ఇవాళ దీపావళి నువ్వు ఇంటికి రావటం లేదా అన్ది.... ఏడవ లేక నవ్వలేక

ఇలా కార్యాలయమునకి బయలు దేరా ...
దీని మెడలో బెల్టు ... నా  మెడలో మా కంపెనీ ఐది కార్డు అంతే తేడ

PS: ఒంటరిగా ఈ రోజు దీపావళి జరుపుకుంటున్న మిత్రులందరికీ అంకితం (కుక్క బొమ్మలు నావి కాదు ............. గూగుల్  నుంచి సేకరించినవి ).




23, అక్టోబర్ 2014, గురువారం

అందరికి నమస్కారం

 గత కొన్ని సంవస్తరాలుగా   పుస్తకాలు విరివిగా చదివి, ఇక ఓపిక పట్టలేక కవిని అయిపోదామని ఇలా బ్లాగ్ తెరిచా. 

ఇక రేపటి నుండి ఈ లోకంలో  నేను కూడా విహరిస్తా.....